167
ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ లో మంత్రులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని దానిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి. గతంలో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంక్షన్ ల విషయంలో కొనియాడిందని చెప్పారు. గుంటూరు జి డి సి.సి బ్యాంక్ మైక్రో ATM ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కాకాని వచ్చారు. పార్టీ పెట్టి ఎవరికో ఓట్లు వేయమనే పార్టీలని తాము పట్టించుకోమని పవన్ కళ్యాణ్ పై సెటైర్లు విసిరారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాము ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.