ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం – కేసీఆర్
86
previous post