వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తెలుగు వారందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రం గా ఆంధ్ర రాష్ట్రం గా ఉండాలని ఆ నాడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అలాగే ముద్దాయిగా బయటకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ వారు సంబరాలు జరుపుకోవటం ఎంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని కాకుండా ఆరోగ్య సమస్య ఉన్న కారణంగా షరతుల పై మద్యంతర బేయిల్ మాత్రమే ఇచ్చారని అది తెలుగు దేశం పార్టీ వారు తెలుసుకోవాలని అన్నారు.
ఒక రాష్ట్రంగా – ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలన్న బొల్లా
136
previous post