వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తెలుగు వారందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రం గా ఆంధ్ర రాష్ట్రం గా ఉండాలని ఆ నాడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అలాగే ముద్దాయిగా బయటకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ వారు సంబరాలు జరుపుకోవటం ఎంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని కాకుండా ఆరోగ్య సమస్య ఉన్న కారణంగా షరతుల పై మద్యంతర బేయిల్ మాత్రమే ఇచ్చారని అది తెలుగు దేశం పార్టీ వారు తెలుసుకోవాలని అన్నారు.
Tag:
పొట్టి శ్రీరాములు
బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మరియు ముఖ్యంగా బాపట్ల జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహనీయుల త్యాగాలు మరువకూడదు రాష్ట్రం కోసం అసువులు బాసిన మహనీయులను ఎప్పటికీ మర్చిపోకూడదని ముఖ్యంగా పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములకు నివాళులర్పిద్దాం అని రాష్ట్ర అవతరణకు కృషి చేసిన ప్రముఖులందరకు మరొకసారి నివాళులర్పిస్తున్నాను అని ఆయన అన్నారు.





Total views : 78393