కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారం..

Kandula Sandhyarani

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని సీతానగర్ కూరగాయల మార్కేట్ లో రామగుండం నియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు&period; కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను వినియోగదారులను కలిసి బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంధ్యారాణి కోరారు&period; అనంతరం బిజెపి అభ్యర్థి సంధ్యారాణి మాట్లాడుతూ&period;&period; గత పాలకుల నిర్లక్ష్యంతో కూరగాయల మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు నీలయంగా మారిందని విమర్శించారు&period; వర్షాకాలంలో రైతులు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కనీస సౌకర్యాలను కల్పించడంలో నాయకులు విఫలమయ్యారని విమర్శించారు&period; రామగుండంలో బిజెపి పార్టీని గెలిపిస్తే…గెలిచిన నెల రోజుల్లో సుందరీకరణ తీర్చిదిద్ది ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు విరామం తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామన్నారు&period; కూరగాయల మార్కెట్ భువన సముదాయం కోసం కోట్ల రూపాయలు వేచించి నాయకులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు&period; సామాన్య మహిళగా రామగుండం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని&comma; ప్రత్యేక మెజార్టీతో గెలిపించాలని కందుల సంధ్యారాణి వారిని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే