వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

Advertisements

<p>వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు&period; ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై అందిన ప్రతి ఫిర్యాదుపైనా అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు&period; ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి భూ వివాదాలు&comma; పింఛన్లు&comma; రేషన్ కార్డులు&comma; ఉద్యోగ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు&period;<br &sol;>&NewLine;ప్రజావాణి వేదికగా నాసన్‌పల్లి తండా గ్రామస్థులు తమ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు&period; తమ తండాకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలను రెండు గ్రూపులుగా విభజించి తీవ్ర వివక్ష చూపిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు&period; కేవలం తనకు నచ్చిన ఒకే గ్రూపునకు పనులు కల్పిస్తూ&period;&period; మరో గ్రూపునకు ఉపాధి పనులు చూపించకుండా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు&period; ఈ అన్యాయంపై స్థానిక ఎంపీడీవోకు&comma; టెక్నికల్ అసిస్టెంట్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని&period;&period; అందుకే నేరుగా కలెక్టరేట్‌కు వచ్చామని తండావాసులు తెలిపారు&period; ఉపాధి కూలీల పొట్టకొడుతున్న సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌ను తక్షణమే విధుల నుండి తొలగించి&comma; సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..