బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారన్నారు. మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారన్నారు. ధర్మం కోసం పోరాడేది భాజపా. రాజాసింగ్, నేను.. ధర్మం కోసం పోరాడేవాళ్లం. మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు.
కరీంనగర్‌లో నామినేషన్ వేసిన బండి సంజయ్, భారీ బైక్ ర్యాలీతో
79