భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుండి భారీ ఎత్తున ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ యాత్ర లో పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు నడిచారు. భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు, విద్యార్థులు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ కదం తొక్కారు. బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తుమన్నారు
మూడు రంగుల జాతీయ జెండా మనందరి ఆత్మగౌరవ పతాకం. జెండా, ఎంజెడాలను పక్కనపెట్టి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై మువ్వెన్నల జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. అట్లాగే ఎంతో మంది మహనీయులు దేశం కోసం బలిదానం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం నెహ్రూ కుటుంబానికి లబ్ది చేయడమే లక్ష్యంగా చరిత్రను తెరమరుగు చేసే యత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చూస్తోందన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భోజ్‌శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…
- యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో…
- పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తోంది. వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన వారు చాలా కాలంగా 13 పాయింట్లకే పరిమితమై ఉన్నారు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే మరియు ఆర్ఆర్ కూడా వారికి దగ్గరగా వచ్చేశాయి. మరోసారి బౌలర్లే జట్టును నిరాశపరిచారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 77978