కాకినాడలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తత..

NTR Statue

Advertisements

&NewLine;<p>కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు&comma; దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది&period; ఈ సంఘటన కాకినాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది&period; టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు&period; కాకినాడ సినిమా రోడ్లో ఉన్న సంత చెరువు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి బయట శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరి నిరసన వ్యక్తం చేశారు&period; అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడి బయట వైసీపీకి చెందిన నాయకులు స్పీకర్లనుండి వచ్చిన కీర్తనలకు భజనలు చేపట్టారు&period; దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి&period; తమ అభిమాన నేత ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తుంటే దానికి మేము ఆందోళన వ్యక్తం చేయగా వైకాపా వాళ్లు పోటీగా పెద్ద శబ్దాలతో దేవుని భజనలు చేయడం అన్యాయమన్నారు&period; టీడీపీ&comma; వైకాపా వాళ్లు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేయగా పోలీసులు చేరుకొని ఎటువంటి వివాదాలు రాకుండా సర్ది చెప్పారు&period;&period; ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ పి మురళీకృష్ణ రెడ్డి&comma; ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ బి అప్పారావులతో పాటు పోలీసు సిబ్బంది వైకాపా&comma; టీడీపీ నాయకులతో కొంతసేపు చర్చలు జరిపారు&period; ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కకు జరుపుతున్నామని వైకాపా వారు చెప్పగా దానికి టీడీపీ వాళ్ళు అక్కడే కుడి పక్కకు మార్చాలని పట్టుబట్టారు&period; కొంతసేపు వాగ్వివాదం వైకాపా&comma; టీడీపీ శ్రేణుల మధ్య జరిగింది&period; పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..