202
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడుతున్న ప్రజలు. రాత్రి 11.30గంటల ప్రాంతంలోనూ జాతీయరహదారిపై వేచిచూస్తున్న మహిళలు, అభిమానులు. రాజమండ్రి నుంచి 7గంటలకు పైగా సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రయాణం. భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై గంటకు 20కిలోమీటర్లు కూడా సాగని కాన్వాయ్. వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అదుపుచేయలేక ఆపసోపాలు పడుతున్న పోలీసులు.