కేసీఆర్ అన్ని అబద్దాలే – తుమ్మల

Tummal Nageswara Rao

Advertisements

&NewLine;<p>పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్దాలే మాట్లాడారని&comma; ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు&period; శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెం మాత్రమే గెలిచిందని&comma; దీంతో పార్టీ బలోపేతం కోసం నన్ను బతిమాలి పార్టీలో చేర్చుకొలేదా&quest; అని ప్రశ్నించారు&period; నేను పార్టీలో చేరిన రోజూ జిల్లా పరిషత్ చైర్మన్ డీసీఎంఎస్ చైర్మన్&comma; జెడ్పీటీసీలు&comma; ఎంపీపీలు వందల మంది సర్పంచ్‌లు పార్టీలో చేరింది నిజంకాదా&quest; డిపాజిట్లు రాని పార్టీని జిల్లాలో నేను బలోపేతం చేసింది నిజం కాదా&quest; అని నిలదీశారు&period; 40 ఏళ్ల సహవాసంలో నా నిబద్ధత ఏమిటో కేసీఆర్‌కు తెలుసునన్నారు&period; అలాంటి మీరు పార్టీ మారిన పువ్వాడ అజయ్ కుమార్‌కు ప్రభుత్వ భూములు&comma; పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికు కాంట్రాక్ట్‌లు ఇచ్చి… వారిని పక్కన పెట్టుకొని నాపై విమర్శలు చేస్తారా&quest; నేను పార్టీ మారితే మీరుచేసిన వ్యాఖ్యలు జిల్లా ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు&period; కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు&period; ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని&comma; ఇక్కడి ప్రజల కోసం మీ రాజకీయ విమర్శలను భరిస్తానన్నారు&period; తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీకి ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని&comma; మానసిక దౌర్బల్యంతోనే కేసీఆర్ తనపై విమర్శలు చేశారన్నారు&period; నా 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా తెలిసి కూడా నీ స్వార్థం కోసం మాట్లాడతావా అని మండిపడ్డారు&period; తాను బీఆర్ఎస్‌లో చేరిన సమయంలో అక్కడకు వచ్చిన వారిని చూసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు లేవా&quest; అన్నారు&period; మనం పార్టీ మారినా ఇంతమంది మనతో రారని కేటీఆర్ అనలేదా&quest; తుమ్మలతో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రభంజనంలా వచ్చి చేరారని చెప్పింది మర్చిపోయావా&quest; పదవుల కోసం కాదు సీతారామ&comma; భక్త రామదాసు ప్రాజెక్టుల కోసమే తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు&period; భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడని పొగిడిన పొగడ్తలు జిల్లా ప్రజానీకం చూశారని&comma; పాలేరులో నా ఓటమికి నీ కుమారుడే కారణమన్న విషయం మీకు తెలుసు అన్నారు&period; మా కత్తితో మేమే పొడుచుకున్నామని మీరే మీడియా ముఖంగా చెప్పారు&comma; ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం&comma; స్థానిక సంస్థల ఎన్నికల్లో&comma; ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపులో నా పాత్ర లేదా&quest; అని తుమ్మల ప్రశ్నించారు&period; ఓడిపోయి మూలన కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని&comma; పార్టీ కోసం చేసింది నేను సున్నా అని చవకబారు విమర్శలు చేస్తావా&quest; అని ధ్వజమెత్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.