112
పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లోని చంద్రగ్రహణం రోజున శివాలయంలో ఓ వింత సంఘటన జరిగింది. ఆలయం తలుపులు తెరిచిన పురోహితునికి గర్భగుడిలోని శివలింగం వద్ద త్రాచు పాము దర్శనం ఇచ్చింది. ఒక్కసారిగా షాక్ తిన్న వేద పండితులు రెండు చేతులు జోడించి శివనామ స్మరణం చేస్తూ మంత్రోచ్చారణ చేశారు. వెంటనే ఆ పాము గర్భగుడి మూలకు వెళ్లి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. అయితే దారి లేకపోవడంతో వచ్చిన దారిలో బయటికి వెళ్ళిపోయింది.ఈ సంఘటన పేరుపాలెంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.