చెన్నూరు నియోజకవర్గం సమస్యలు పరిష్కారం కావాలన్నా బి ఆర్ఎస్ ఎమ్మెల్యే నియంతృత్వ పాలన నుండి ప్రజలు విముక్తు కావాలంటే బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి దాసారపు శ్రీనివాస్ బుధవారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి కి ఆశీర్వాద సభ కు విచ్చేసిన కెసిఆర్ ఈ చెన్నూరు నియోజకవర్గం ఏమి హామీ ఇవ్వలేదు సింగరేణి కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే బీఎస్పీ పార్టీతోటే సాధ్యమైతుందని ప్రజలు తమ ఓటును ఏనుగు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.స్థానికేతరుడైన చెన్నూరు ఎమ్మెల్యే ఒక నియంతగా రాజుగా పాలన సాగిస్తూ ఇసుక మాఫియా భూదాన్దా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వందల కోట్లు సంపాదించుకున్నాడు తప్ప నియోజకవర్గానికి ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గడ్డం సోదరులు వారి స్వార్ధ ప్రయోజనాలకు ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప ప్రజలకు కార్మికులకు చేసింది ఏమీ లేదని వారు సూచించారు. సింగరేణి కరెంటును బొగ్గును దోచుకుని కొన్ని వేలకోట్ల రూపాయలు పడ్డాయని బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపించి అబకాయిలను వసూలు చేస్తామని తెలిపారు. లబ్బర్ చెప్పులతో వచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించావని నీ యొక్క పూర్వ పరిస్థితి ఏంటనేది ఉస్మానియా యూనివర్సిటీ తెలుపుతుందని యూనివర్సిటీ నాయకునిగా పనిచేసిన నీవు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే పరిస్థితి నీకు లేదని అన్నారు. 2018 ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నిన్ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న గడ్డం వివేక్ ని గెలిచినచో తన వ్యాపారాలనే చూసుకుంటూ ప్రజల సమస్యలు పట్టించుకోడని అలాంటి వ్యక్తిని గెలిపించుకొని ప్రజలు ఇబ్బంది పడొద్దు అని తెలిపారు. బిఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజల సేవ నిమిత్తం ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎస్పీ లో చేరాడని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో బిఎస్పి అభ్యర్థిని గెలిపించిన ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన చెన్నూరు నియోజవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని బహుజన పార్టీని గెలిపించుకున్నచో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తూరని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గుణ.జిల్లా ఇంఛార్జి జాగిరి రాజేష్, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, విజయ్, జోనల్ మహిళా కన్వీనర్లు అర్చన, భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, మాంతయ్య, సారయ్య, రాజు ఇతర చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
చెన్నూరు నియోజకవర్గం సమస్యలు పరిష్కారం..
101