117
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్‌కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.