తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం..

Advertisements

&NewLine;<p>భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ&comma; భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో తొలి విడుత నవంబర్ 7నాడు జరిగిన ఎన్నికలలో మా ఉద్యమ ప్రాంతాలలోని మెజార్టీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు&period; మధ్య రీజినల్ బ్యూర్ అభినందిస్తున్నది&period; ఉద్యమ ప్రాంతాలలో ఒకటైన బీజాపుర్ నియోజికవర్గం లో కేవలం 41 శాతం పోలింగ్ మాత్రమే జరిగి దాదాపు 59 శాతం ప్రజలు ఎన్నికలను బహిష్కరించి వాటి బూటకత్వాన్ని ఎండగట్టారు&period; ఛత్తీస్ గఢ్ లో విధానసభ ఎన్నికలు రెండు విడుతలుగా జరుపుతున్నారు&period; తొలి విడుత పోలింగ్ జరిగిన 20 నియోజికవర్గాలు మా ఉద్యమ ప్రాంతంలోనే వుండడంతో వీటిలో 1-2 చోట్ల మినహా ఎక్కడా 50-60 శాతానికి మించి పోలింగ్ జరుగలేదు&period; మా ప్రాంతాలలోని ప్రజలు తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటున్న విప్లవ ప్రజా కమిటీ &lpar;జనన సర్కార్&rpar;లపైనే మరోమారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు&period; ఎన్నికల సమయంలో ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున అదనపు అదనపు భద్రతా బలగాలను దించారు&period; ఇప్పటికే వేలాది సంఖ్యలో అడుగడుగున తుపాకులు ధరించిన ఖాకీలతో అడవులు నిండిపోగా&comma; మరిన్ని అదనపు బలగాలను తెచ్చి మొహరించినప్పటికీ&comma; ఎన్నికల అధికారిని రీనాబాబా సాహెబ్ కంగాలీ పదే పదే ఓట్లు వేయాలనీ విజ్ఞప్తులు చేసినప్పటికీ పనికి రాని ప్రజాస్వామ్య మంత్రం పారలేదు&period; ప్రజల రక్షణలో నిలిచిన మా వీర పీ&period;ఎల్&period;జీ&period;ఏ గెరిల్లాలు కేంద్ర&comma; రాష్ట్ర పోలీసుల అణచివేత చర్యలను ప్రతిఘటించడంలో భాగంగా దాదాపు 10 మంది పోలీసులు మరణించడమో&comma; గాయపడడమో జరిగింది&period; అక్కడక్కడ పోలింగ్ సిబ్బంది కూడ గాయపడ్డారు&period; ప్రజల రక్షణకు అంకితమైన &period;పీ&period;ఎల్&period;జే&period;ఏ&period; గెరిల్లాల సాహసిక చర్యలను సీ&period;ఆర్&period; బి&period; అభినందిస్తున్నది&period; ఎన్నికల సిబ్బంది ఇప్పటికైనా మా ప్రాంతాలలోకి పోలీసులు వెంట రాకూడదని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం&period; అతి త్వరలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగునున్నాయి&period; ఎన్నికల బహిష్కరణలో నమూనాగా నిలిచిన ఛత్తీస్ గఢ్ బీజాపుర్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోనూ ఎన్నికలు బహిష్కరించాలనీ మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం&period; బీజేపీ&comma; దానిని అంటకాగుతున్న బీ&period;ఆర్&period;ఎస్&period;ను తన్ని తరమాలనీ మరోమారు పిలుపునిస్తున్నాం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..