101
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతుండగా కొందరు నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు, పోటీ చేయొద్దని కొందరు నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తక్షణమే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో పోటీ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలకు కాసాని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని తెలుస్తోంది. మరోవైపు దమ్ముంటే కాసాని ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మరి కొందరు నేతలు సవాల్ విసిరారని తెలుస్తోంది.