తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.

Advertisements

<p>తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు&period; ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు&period; రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు&period; సమాజంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీసులనే అని ఆయన గుర్తుచేశారు&period; రిట్రీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనడమేనని సీఎం తెలిపారు&period; మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకుంటే&comma; భవిష్యత్తులో ఎక్కడికి చేరుకోవాలో స్పష్టత వస్తుందని అన్నారు&period; అందుకే ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖలో ఎదురవుతున్న సమస్యలను విశ్లేషించుకుని వాటికి తగిన పరిష్కారాలపై చర్చించామని వివరించారు&period; సమస్యలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు&period; ఒకటి టెక్నికల్ ఛాలెంజ్ కాగా&comma; మరొకటి అడాప్టివ్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు&period; టెక్నికల్ సమస్యలను వనరులు మరియు సమయం కేటాయిస్తే పరిష్కరించవచ్చని తెలిపారు&period; అయితే అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో సమస్య యొక్క అసలు కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరమని అన్నారు&period; రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు&period; ఈ దిశగా రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేకుండా ముందుకు సాగేందుకు &OpenCurlyDoubleQuote;తెలంగాణ రైజింగ్ 2047” అనే పాలసీ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు&period; 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు&period; పెట్టుబడులను ఆకర్షించేందుకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని సుమారు 2100 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>దేశంలోని ఇతర మెట్రో నగరాల పరిస్థితులను కూడా సీఎం ఉదాహరణగా ప్రస్తావించారు&period; ఢిల్లీ నగరం కాలుష్య సమస్యతో బాధపడుతుండగా&comma; బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు&period; ముంబై&comma; చెన్నై నగరాలు వరదల సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు&period; ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు&period; పోలీసింగ్ వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు&period; ఒకప్పుడు తీవ్రవాదం పెద్ద సమస్యగా ఉండేదని&comma; దాన్ని ఎదుర్కొనేందుకు ఆక్టోపస్&comma; గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు&period; ఫిజికల్ క్రైమ్ నియంత్రణ కోసం ఇప్పటివరకు పలు వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ&comma; ప్రస్తుతం నేరాల స్వరూపం మారిందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం సైబర్ క్రైమ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను కూడా సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు&period; సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అధికారులను నియమించుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న సిబ్బందికి కూడా నూతన శిక్షణ ఇవ్వాలని సూచించారు&period; పోలీస్ శాఖలో సిబ్బంది మరియు అధికారులను నిరంతరం అప్‌డేట్ చేయకపోతే నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు&period; ఈ రిట్రీట్ కార్యక్రమంలో సైబర్ క్రైమ్&comma; నార్కోటిక్స్&comma; రిక్రూట్‌మెంట్ తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సీఎం తెలిపారు&period; ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు&period; ఆ కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.