దసరా పండుగ సందర్భంగా కాసుల వర్షం

RTC Bus

Advertisements

&NewLine;<p>తెలంగాణలో దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది&period; దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది&period; దీంతో ఆర్టీసీకి సుమారు రూ&period;25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు&period; పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు&period; తెలంగాణతో పాటు ఏపీ&comma; కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5&comma;500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది&period; గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 1&comma;302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది&period; ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్‌ స్టేషన్లు అయిన ఎంజీబీఎస్‌&comma; జేబీఎస్‌లతో పాటు సీబీఎస్‌&comma; దిల్‌షుక్‌నగర్‌&comma; లింగంపల్లి&comma; చందానగర్‌&comma; కేపీహెచ్‌బీ&comma; ఎస్‌ఆర్‌నగర్‌&comma; అమీర్‌పేట్‌&comma; టెలిఫోన్‌ భవన్‌&comma; ఈసీఐఎల్‌&comma; ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌&comma; ఎల్బీనగర్‌à°² నుంచి కూడా ఆర్టీసీ&period;&period; ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది&period; దసరా సందర్భంగా ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..