నాగం నివాసంకు బీఆర్‌ఎస్‌ మంత్రులు

Nagam

Advertisements

&NewLine;<p>సీనియర్‌ నేత&comma; మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ మంత్రులు కేటీఆర్‌&comma; హరీష్‌ రావు కలిశారు&period; కాంగ్రెస్‌ పార్టీ జనార్ధన్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు&period; తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు&period; మంత్రుల వెంట పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఉన్నారు&period; రాష్ట్రంలో సీనియర్ నేతగా పేరున్న ఆయనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు&period; ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు&period; ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు&period; పార్టీలో జరిగిన అవమానాలను&comma; కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు&comma; ప్రజలకు వివరించారు&period; త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు&period; ఈ నేపథ్యంలో మంత్రులు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..