100
పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. పెద్దపల్లి నియోజకవర్గం లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అన్ని సిద్దం చేశారు.ఆర్వో కార్యాలయాల వద్ద నామినేషన్ దాఖలు చెయ్యడం కోసం సందేహాలను నివృత్తి చెయ్యడం కోసం ఆయా కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లకు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్వో కార్యాలయాల పరిసర ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టూ వంద మీటర్ల దూరం లో మార్క్ చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఆర్వో కార్యాలయానికి బందోబస్తుని ఏర్పాట్లును పెద్దపల్లి డిసిపి Dr.చేతన మరియు ఎసిపి ఎడ్ల మహేష్ పరిశీలించారు.