నిర్మాణ కంపెనీలపై తెలంగాణ రెరా సీరియస్

Advertisements

<p>రియల్ ఎస్టేట్ చట్టం&comma; 2016లో పొందుపరిచిన అధికారాలతో పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్&comma; విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period; సదరు ప్రాజెక్టులోని ఏ&comma;సీ&comma;డీ బ్లాకులకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించిందని&comma; అయితే ప్రమోటర్ చట్టంలోని సెక్షన్ 3&lpar;1&rpar; ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపింది&period; బీ&comma;ఈ&comma;ఎఫ్&comma;జీ బ్లాకులతో పాటు అదనపు అంతస్తులకు ప్రకటనలు ఇవ్వడం&comma; మార్కెటింగ్ చేయడం&comma; విక్రయాలకు ఆఫర్ చేయడం అథారిటీ గమనించింది&period; చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద 44 లక్షల భారీ జరిమానాను అథారిటీ విధించింది&period; దీంతోపాటు ప్రాజెక్టులో రిజిస్టర్ చేయబడిన భాగానికి సంబంధించి డిసెంబర్ 2024 గడువు దాటినా నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని అథారిటీ గుర్తించింది&period; నిర్మాణ ప్రగతి నివేదిక&comma; ప్రాజెక్ట్ నిధుల వినియోగం&comma; అఫిడవిట్‌తో కూడిన సవరించిన గడువును రెండు వారాల్లోపు సమర్పించాలని ప్రమోటర్‌ను ఆదేశించింది&period; కొనుగోలుదారులందరూ స్వయంగా &OpenCurlyQuote;కొనుగోలుదారుల సంఘం’ ఏర్పాటు చేసుకునే ప్రక్రియను ప్రారంభించడానికి అథారిటీ అనుమతించింది&period;<&sol;p>&NewLine;<p>బాచుపల్లిలోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యజమానుల బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని తెలంగాణ రెరా అథారిటీ తప్పుబట్టింది&period; అక్రమ ఆలస్య రుసుములను తొలగించి&comma; సవరించిన ఖాతా వివరాలను అందించాలని పసిఫికా కన్ స్ట్రక్షన్‌ను ఆదేశించింది&period; పాత కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రమోటర్ వేయలేరని తేల్చి చెప్పింది&period; 30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది&period; సూరారంలోని &OpenCurlyQuote;తులసి లేక్ ఫ్రంట్’ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వి&period;సోల్మన్ రాజుకి 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పొజీషన్ అప్పగించాలని తులసి కన్ స్ట్రక్షన్స్ మరియు భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టును రెరా ఆదేశించింది&period; బాధితుడు 2020లోనే రూ&period;31 లక్షల పూర్తి విక్రయ మొత్తాన్ని చెల్లించినప్పటికీ&comma; బిల్డర్ &comma; మార్కెటింగ్ ఏజెన్సీ మధ్య ఉన్న అంతర్గత ఆర్థిక వివాదాల వల్ల గత రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ నిలిపివేశారు&period; బిల్డర్ మరియు ఏజెన్సీ మధ్య వివాదాలు కొనుగోలుదారుని చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసిన అథారిటీ&comma; ఈ ఆదేశాలను పాటించకపోతే సెక్షన్ 63 ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది&period; సైదాబాద్ కాలనీలో రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన రాజా ఇన్ఫ్రా కన్ స్ట్రక్షన్స్ ప్రాజెక్టుపై కూడా కఠిన చర్యలకు రెరా ఆదేశాలు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త.

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.