నీలం మధుకు కాంగ్రెస్ టిక్కెట్..

Gandhi Bhavan

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నిన్న 16 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది&period; ఈ జాబితాలో పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది&period; దీంతో పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది&period; టిక్కెట్ దక్కని నేతల అనుచరులు నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు&period; ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంపై ఇతర ఆశావహులు గుర్రుగా ఉన్నారు&period; టిక్కెట్ ఆశించి భంగపడిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు&period; దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది&period; ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు&period; ఇదిలా ఉండగా&comma; మాజీ ఉప ముఖ్యమంత్రి&comma; కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ… ఆందోళన చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులకు ఫోన్ చేసి సముదాయించారు&period; టిక్కెట్ శ్రీనివాస్ గౌడ్‌కే ఇస్తామని హామీ ఇచ్చారు&period; దీంతో శ్రీనివాస్ గౌడ్ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.