పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
పద్మారావు నగర్ లో తలసాని పాదయాత్ర..
120
previous post