పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; స్థానిక భారత రాయబార కార్యాలయం సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్‌లోని భారతీయులకు సూచించింది&period; ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక సూచనలు చేసింది&period; యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు&period; ఇప్పటివరకు 550 మంది భారతీయులు భూభాగ సరిహద్దుల ద్వారా ఇరాన్ నుంచి ఆర్మేనియా చేరుకున్నారని&comma; మరో 90 మంది భారతీయులు అజర్‌బైజాన్‌కు తరలివెళ్లారని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>తీర్థయాత్ర కోసం ఇరాన్ వెళ్లిన 284 మంది భారతీయులలో కొందరు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా&comma; మిగిలిన వారు త్వరలోనే రానున్నారు&period; ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ముందస్తు జాగ్రత్తగా నగర శివార్లలోని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది&period; టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని&comma; క్షేత్రస్థాయిలో భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని స్పష్టం చేసింది&period; హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని&comma; రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>గల్ఫ్ దేశాల నుంచి భారతీయుల తరలింపు ముమ్మరంగా సాగుతోందని అధికారులు తెలిపారు&period; ఫిబ్రవరి 28à°¨ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల 20 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించారు&period; యూఏఈ&comma; సౌదీ అరేబియా&comma; ఒమన్&comma; ఖతార్ వంటి దేశాల నుంచి భారత్‌కు 45 విమానాలను నడుపుతున్నట్లు పేర్కొన్నారు&period; ఖతార్ తన గగనతలాన్ని పాక్షికంగా తెరవడంతో అక్కడి నుంచి విమానాలు నడుస్తున్నాయని వెల్లడించారు&period; కువైట్ గగనతలం ఇంకా మూసివేసే ఉండటంతో&comma; త్వరలోనే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు&period; బహ్రెయిన్&comma; ఇరాక్ ప్రజలకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.