తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.

Advertisements

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు&period; పలువురి తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు&period; సీఎల్పీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; అసెంబ్లీలో&comma; బయట అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచించారు&period; సభకు అన్ని విధాలుగా ప్రిపేర్ అయి రావాలని అన్నారు&period; బయట చిట్‌చాట్‌లు మానివేయాలని అన్నారు&period; ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలోని సమస్యలను చెప్పుకోవడానికి మంత్రులు వారికి సమయం ఇవ్వాలని సూచించారు&period; ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలకు స్పందించాలని అన్నారు&period; ఇక నుంచి తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని ముఖ్యమంత్రి అన్నారు&period; సభలో ప్రతిపక్షాల ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటి సీఎల్పీ సమావేశానికి ఆరుగురు సభ్యులు రాలేదని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు&period; సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అని అసహనం వ్యక్తం చేశారు&period; ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం మినహాయించవచ్చని పేర్కొన్నారు&period; అసెంబ్లీకి ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేశారు&period; తాము ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఇన్నోవేటివ్‌గా ఉంటుందని&comma; విద్య&comma; వైద్యంకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు&period; సభలో మాట్లాడే సమయంలో విప్‌à°² మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు&period; బీఆర్ఎస్ హయాంలో జానారెడ్డి&comma; మల్లు భట్టివిక్రమార్కలకు కూడా మైక్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయని&comma; కానీ తాము ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తున్నామని అన్నారు&period; రాజకీయాల్లో మాట్లాడే మాటల వల్ల వ్యక్తిగత డ్యామేజీ ఏమో కానీ&comma; వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు&period; ప్రతి ఒక్కరు పార్టీ&comma; ప్రభుత్వం లైన్‌లోనే స్పందించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..