చట్టసభల్లో అధికార, ప్రతిపక్షాలు స్పీకర్ కు రెండు కళ్లు లాంటివి. సభలో కుడి వైపున అధికార పక్షం, ఎడమ వైపున ప్రతిపక్ష సభ్యులు కూర్చుంటారు. చట్టసభల్లో ప్రజావాణి మూగపోకుండా ఉండాలి అంటే స్పీకర్ చూపు ఎడమ వైపే ఎక్కువగా ఉండాలి. ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత కొంతకాలంగా కనుమరుగయింది. స్పీకర్ గా ఎన్నికయిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఇదో సవాల్. పాత్రుడు అధికార తెలుగుదేశానికి ఆది నుంచి విశ్వాసపాత్రుడు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. అదే ప్రాంతానికి చెందిన తమ్మినేని సీతారాం గత వైసీపీ ప్రభుత్వంలో స్పీకరగా ఉన్నారు. జగన్ శిబిరం అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని సభలో కించపరుస్తున్పప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని హావభావాలు చూస్తే ఏవగింపు కలిగించేలా ప్రవర్తించారనే వర్తలు వచ్చాయి. అచ్చెన్నాయుడు ఆహారాన్ని గురించి సభానాయకుడు గేలి చేస్తున్నప్పుడు కూడా తమ్మినేని ఏక పక్షంగానే కనిపించారని సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది.ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అదే స్థానంలోకి వచ్చారు. అయ్యన్న కుటుంబం జగన్ ప్రభుత్వం హయాంలో వేధింపులకు గురయింది. అప్పటి ప్రభుత్వం అయ్యన్న ఇంటిని అక్రమ కట్టడం అని కూలగొట్టింది. సీఐడీనిని ఉసిగొల్పి 10 కేసులపైనే అయ్యన్న కుటుంబంపై బనాయిచింది. ఎన్టీఆర్ కాలం నుంచీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయ్యన్న పాత్రుడు టీడీపీ కి ఓల్డ్ గార్డ్. ఒకరకంగా చెప్పాలంటే అయ్యన్నపాత్రుడు బాబుకి ఫ్రంట్ లైన్ వారియర్. రెఫరీగా ఉండాల్సినస్థానంలోకి ఇప్పుడు బాబు అయ్యన్నను సభాపతిని చేశారు. అంటే బాబు విజన్ క్లియర్. పంటికి పన్ను, కంటికి కన్ను అనే బాబు ధోరణ స్పష్టం అవుతోంది.అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కోడెల శివప్రసాద్ కంటే, తమ్మినేని కంటే అయ్యన్న వేరుగా ఉండలేరని అర్థం అవుతోందంటున్నారు విశ్లేషకులు. సభాపతి అయ్యాక అయ్యన్న ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ప్రసంగంలో ప్రతిపక్షం పేరును కూడా ప్రస్తావించలేదు. తన ఉన్నతికి కారణమయిన రాజకయీ పార్టీకి అతీతంగా ఉండడం అయ్యన్నకు సాధ్యమా? దీనికి తోడు అధికారపక్షానికి మెజారీటీ ఉంది. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిలో ఉంది. గతాన్ని దిగమింగి అధికార పక్షం మాటకు భిన్నంగా సంప్రదాయం కోసం సభాపతి సమధర్మాన్ని పాటించగలరా? అక్కడ ఉండేది ఒకప్పటి లోక్ సభ స్పీకర్లు నీలం సంజీవ రెడ్డి, సోమనాథ్ చటర్జీ కాదు. కేవలం అధికారపార్టీకి విశ్వాసులు మాత్రమే. ఇప్పుడు సభలో లేని యనమల, అశోకగజపతి రాజు లాంటివారు మినహా సభలో ఎంతమంది సభా ప్రవర్తనా నియమావళిని వంటపట్టించుకున్నారు? పోయిన కాలమే మంచిదనిపిస్తోంది. అనే వాదనలు వినిపిస్తున్నాయి.ఆ నాటి ఉమ్మడి రాష్ట్రంలో సంఖ్యాబలం లేక కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా ను కోల్పోయింది. 27 మంది సభ్యులతో పీజేఆర్ ప్రతిపక్షనాయకుడు. యనమల రామకృష్ణుడు స్పీకర్ స్థానంలో ఉండి బ్యాలెన్స్ చేయగలిగారు. ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్షం సభకు వెళ్లాలి.తర్వాత కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి స్పీకర్ గా ఎంపికయిన దళిత మహిళ ప్రతిభా భారతికి అది గడ్డుకాలం. 90 మంది సభ్యులకు పైబడి ఉన్న కాంగ్రెస్ బలమయిన ప్రతిపక్షం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే ధీటయిన ప్రతిపక్షనాయకుడు. 90 మంది సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడితే కూడా సభ స్తంభించిపోయేది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతిభా భారతి ఎంతో ఓర్పు, నేర్పు ప్రదర్శించి ప్రతిపక్షం గొంతు నొక్కేశారనే అపవాదు లేకుండా నెట్టుకొచ్చారు. ఇప్పుడ జగన్ పూలు అమ్మాల్సిన చోటే కట్టెలమ్మాల్సి వస్తోంది. ప్రత్యర్థిపైన మీరు రాళ్లూ విసిరారు. అటు వైపు నుంచి మీ మీద పూలు పడవు కదా! గుండె నిబ్బరం కావాల్సింది బలం లేనప్పుడేప్రత్యర్థి పైన మీరు రాళ్ళూ విసిరారు. అటువైపునుంచి మీ మీద పూలు పడవు కదా! జగన్ కు ఇప్పుడు కావాల్సింది
గుండె నిబ్బరం, ఓర్పు, లౌక్యం. బలం లేనప్పుడే. అవమానాలను దిగమింగుకోగలిగిన మనో నిబ్బరం. అది కాస్త బాబు దగ్గర జగన్ అరువు తెచుకోవాల్సిన సమయం ఇదిమనకు వచ్చిన సీట్లను బట్టి చూస్తే మనం అసెంబ్లీకి పొయ్యి పెద్దగా చేసేదేమి లేదు” అని జగన్ అనడం యుద్దానికి ముందే తెల్ల జెండా ఊపడం లాటిదే. అది పలాయనం చిత్తగించడమే అవుతుంది. సభాపతి ఎన్నిక సందర్భం లో జగన్ సభకు హాజరు కాకపోవడం చారిత్రక తప్పిదం.
ఇది ప్రజా తీర్పు. ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్షం సభకు వెళ్లాలి.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.