ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు

chandrababu

Advertisements

&NewLine;<p>ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు&period; ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు&period; పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు&period; ఫైబర్ నెట్‌ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే&period; దీంతో&comma; సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది&period; ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది&period; పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం&comma; విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్&comma; హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు&comma; తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది&period; ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.