112
సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు. ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడారు. తొలుత పంచాయతీ బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బహిరంగ సభ చేరుకున్నారు. సభలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ప్రతిపక్షాలు అడ్డొచ్చినా ముందుకు సాగుతామన్నారు. ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు సభ మధ్యలేనే వెళ్లిపోవటంతో సభ వెలవెలబోయింది.