బీఆర్ఎస్ పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డి – కాంగ్రెస్ కి బిగ్ షాక్

BRS Vishnuvardhan Reddy

Advertisements

&NewLine;<p>జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండడని&comma; కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలిసిందేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు&period; అలాంటి నేత వారసుడికి కాంగ్రెస్ పార్టీ నేడు తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్ రావు విమర్శించారు&period; ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే పీజేఆర్&period;&period; పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లు ఉండేదని చెప్పారు&period; సీఎల్పీ నేతగా పీజేఆర్ ఆ పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు&period; అలాంటి పార్టీ ఇప్పుడు కొంతమంది ముఠాకోరుల చేతుల్లోకి వెళ్లిందని&comma; పార్టీ కోసం కష్టపడుతున్న నేతలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు తెలిపారు&period; ఈ నేపథ్యంలోనే నాగం జనార్దన్ రెడ్డి&comma; విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారని వివరించారు&period; వారిని బీఆర్ఎస్ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించేందుకే నేడు విష్ణువర్ధన్ ఇంటికి వచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు&period; బీఆర్ఎస్ లో చేరేందుకు విష్ణు అంగీకరించారని&comma; త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు&period; నాగం జనార్దన్&comma; విష్ణులకు బీఆర్ఎస్ లో గౌరవాన్ని&comma; సముచిత స్థానాన్ని కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తర్వాత విష్ణు అధికార పార్టీలో చేరతారని సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..