ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా తుమ్మల మాట్లాడుతూ.. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా పాటుపడాలని.. కలుషిత రాజకీయాలను దూరం చేసి మానసికంగా దృఢంగా ఉండేలా అడుగులు వేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాలేరు నుంచి పాపికొండల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కిందని.. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
107
previous post