తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ ప్రచారానికి రానున్నారు. ఈ మేరకు ముఖ్యనేతల పేర్లను భాజపా వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలూ ఉన్నారు.క్యాంపెయినర్ జాబితాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, యడియూరప్ప. ఇదిలాఉండగా ప్రచారం కమిటీలో ఉన్న విజయశాంతి కి కమిటీలో చోటు దక్కలేదు. కనీసం విజయశాంతితో మాట్లాడేందుకు కూడా బీజేపీ నేతలు యత్నించలేదు.
భాజపా తరఫున ప్రచారానికి మోదీ సహా 40 మంది ముఖ్య నేతలు…
100