భారత్‌పై ఘోర ఓటమితో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం, మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రీడల మంత్రిత్వ శాఖ.

Advertisements

&NewLine;<p>ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ప్రదర్శనపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు&period; ముఖ్యంగా ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ లో అవమానకర రీతిలో ఓడిపోవడంపై సీరియస్ అయ్యారు&period; దిద్దుబాటు చర్యలు చేపట్టిన మంత్రి&period;&period; మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు&period; ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు&period;1996 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు నేతృత్వం వహించిన అర్జున రణతుంగను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు&period; ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి&comma; క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు&period; ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు&period;శ్రీలంక క్రికెట్ బోర్డ్ అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు&period; బోర్డ్ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు&period; వరల్డ్ కప్ టోర్నీలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు&period; తాజాగా బోర్డు మొత్తాన్ని తొలగిస్తూ మంత్రి రోషన్ రణసింఘె ఉత్తర్వులు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…