భారత సుప్రీం కోర్టు మత మార్పిడిలపై సంచలన తీర్పును ప్రకటించింది.

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Advertisements

<p>భారత సుప్రీం కోర్టు మత మార్పిడిలపై సంచలన తీర్పును ప్రకటించింది&period; ఎస్సీ కులానికి చెందిన వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది&period; హిందూ&comma; బౌద్ధ&comma; సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారిన వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది&period; గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది&period; గతంలో ఏపీ హైకోర్టు జరిగిన విచారణలో&period;&period; క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్‌ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది&period; దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా&period;&period; ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p>గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో ఒక పాస్టర్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది&period; దశాబ్ద కాలంగా పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు కోర్టు గుర్తించింది&period; క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని&comma; కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత అట్రాసిటీ చట్టం &lpar;SC&sol;ST Act&rpar; కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది&period; దాడి జరిగిన సమయంలోనూ సదరు వ్యక్తి ప్రార్థనలు చేస్తున్నట్లు గుర్తించిన కోర్టు&comma; ఈ వ్యాఖ్యలు చేసింది&period;<&sol;p>&NewLine;<p>తహశీల్దార్ ఇచ్చిన ఎస్సీ &lpar;SC&rpar; కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ&comma; మత మార్పిడి తర్వాత ఆ చట్టపరమైన రక్షణ పొందేందుకు సదరు వ్యక్తికి అర్హత ఉండదని కోర్టు పేర్కొంది&period; రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం&comma; ఎస్సీ హోదా కేవలం హిందూ&comma; సిక్కు&comma; బౌద్ధ మతాలను అనుసరించే వారికి మాత్రమే పరిమితం చేయబడింది&period; మత మార్పిడి ద్వారా క్రైస్తవం&comma; ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే ఎస్సీ హోదా రద్దవుతుందని&comma; తద్వారా అట్రాసిటీ చట్టం వర్తించదని హైకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది&period; ఈ తీర్పును సవాల్ చేసి సుప్రీంకి వెళ్లిన ఫాస్టర్ కు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.