126
బీఆర్ఎస్ను ఓడించే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని గజానంద్‌గడ్డ, పాములబస్తీ, పోచమ్మబస్తీ, కుర్మబస్తీలో బీఆర్ఎస్ అంబర్‌పేట అభ్యర్థి, కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటే్‌షలకు మహిళలు శాలువాకప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పరిశీలకులు గండ్ర మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు సీ.హెచ్.చంద్రమోహన్, నాయకులు శ్రీపతిరెడ్డి, పద్మావతి పాల్గొన్నారు.