మహిళలకు క్షమాపణ చెప్పిన – నితీశ్ కుమార్

Nitish Kumar

Advertisements

&NewLine;<p>బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు&period; అసెంబ్లీలో తన స్పీచ్ పై ఆయన బుధవారం మీడియా ముందు స్పందించారు&period; తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు&period; ఎవరినీ కించపరచాలని అనుకోలేదని&comma; సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో అలా మాట్లాడానని వివరించారు&period; ఏదేమైనా తన స్పీచ్ తో బాధపడిన మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు&period; అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ స్పీచ్ పై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు&period; బుధవారం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు&period; నితీశ్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు&period; ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై నితీశ్ కుమార్ స్పందిస్తూ&period;&period; ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభ్యంతరాలపై మీడియా ముందే వివరణ ఇచ్చినట్లు తెలిపారు&period; నితీశ్ కుమార్ స్పీచ్ చూసి ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని బీజేపీ నేతలు విమర్శించారు&period; అసెంబ్లీలో ఆయన మాటలు విన్న వారందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితని మండిపడ్డారు&period; నితీశ్ మైండ్ పనిచేయడంలేదని&comma; ఆయన స్టేట్ మెంట్ మరీ థర్డ్ గ్రేడ్ గా ఉందని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్