ఎన్నికల్లో ఉచిత హామీల పై స్పందించిన వెంకయ్య నాయుడు..

Venkaiah Naidu

Advertisements

&NewLine;<p>ఎన్నికల్లో ఉచిత హామీలకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు&period; అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చగలమా&quest; లేదా&quest; అందుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా&quest; అని అంచనా వేయకుండానే పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తుంటాయని విమర్శించారు&period; దేశంలో పేద&comma; మధ్య తరగతి&comma; అంతకంటే దిగువన ఎంతోమంది జీవిస్తున్నారని పేర్కొన్న ఆయన&period;&period; పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ హామీపై మాత్రం హర్షం వ్యక్తం చేశారు&period; ప్రధాని హామీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు&period; దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ ఒక్క ఢిల్లీ ప్రభుత్వానిదే కాదని&comma; కేంద్రంతోపాటు పక్క రాష్ట్రాలూ బాధ్యత తీసుకోవాలన్నారు&period; ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని&comma; రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు