రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని, కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ప్రతినిధులతో కల్సి సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూపు మహిళలలో అత్యధిక శాతం ఎన్డీయే కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులను చూసే మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ నిజానికి రాజమండ్రి డ్వాక్రా గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోట అనే విషయం వేరే చెప్పనవసరం లేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఇచ్చిన ప్రతిహమీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షణాల చేశామన్నారు. గత మూడు కౌన్సిల్స్ లో సభ్యులుగా ఉన్న మాజీ కార్పొరేటర్లకు ఎంతో అవగాహన ఉందని, వారంతా బాధ్యతగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాల్వ్ కూడా తిరగకపోతే కొత్త గా వేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఐదేళ్లుగా ఏమి జరిగిందో వెనక్కి తవ్వే ఆలోచన తమకు లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకున్నా సరే, జగన్మోహన్ రెడ్డి నిగౌరవించి లోపలకు పంపించామని గుర్తుచేసారు. ఇంతటి భారీ మెజార్టీలు ఇచ్చిన ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధివైపు దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నామని ఆయన స్పష్టంచేసారు. వేఅయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం తప్పులుగా చూపించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టంచేశారు. తెల్సి తెల్సి కూడా తప్పులు చేసినపుడు ఎన్డీయే కూటమి సూచన మేరకు చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో మాదిరిగా నలుపు దుస్తులు, నలుపు మాస్క్ లు పెట్టుకున్నా కార్యక్రమానికి రానివ్వని పరిస్థితులు ఉండబోవని, అలాగే పరదాలు కట్టుకుని తిరిగే విధానం చంద్రభాబు నాయుడికి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మీ దగ్గరమే వచ్చి మీ సమస్యలు వింటారని, మీతో మమేకమవుతారని అన్నారు. వేధింపులు ఉండవని, మినహాయింపులు ఉండవని అన్నారు. శుభపరిణామంగా మంచి రోజులు వస్తున్నాయని అందరూ కలసికట్టుగా పనిచేయడం ప్రారంభించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. హేవలాక్ బ్రిడ్జి గురించి, మల్టీపర్పస్ స్టేడియం మేచింగ్ గ్రాంట్ సంబంధించిన ఫైళ్లు పట్టుకుని ఎంపీ పురందేశ్వరి ఢల్లీి వెళ్లారని ఆయన అన్నారు. కాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చెం అందచేసి అభినందించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆర్పీలు, సీఓలు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.