వచ్చే నెల జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిండంకోసం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త చట్టాలపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీస్ అధికారులతో పాటు ఇతర వివిధ విభాగాలయిన ట్రాఫిక్, సిసిస్. సిసిఆర్బి, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, సైబర్ క్రైం విభాగాలకు చెందిన పోలీస్ అధికారులకు స్థానిక ఎల్. బి కళాశాల లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులకు పోలీస్ అధికారులు, సిబ్బంది విడతల వారిగా హాజరువుతున్నారు.రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ముందుగా శిక్షణ పొందిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో పోలీస్ అధికారులకు కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలపై పై పూర్తి అవగాహన కలిగించడం జరుగుతోందని. ఈ నెల 6వ తేది నుండి ప్రాంభమైన ఈ శిక్షణ తరగతుల్లో ఇప్పటి వరకు 740 మంది పోలీస్ అధికారులు శిక్షణ పొందారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 30 ముగుస్తాయని అధికారులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90594