Friday, May 22, 2026
News Navigation
Friday, May 22, 2026
News Navigation

Breaking

Friday, May 22, 2026
Home Andhra Pradesh ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్ష సభకు వెళ్లాలి.

ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్ష సభకు వెళ్లాలి.

by Rama
ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్ష సభకు వెళ్లాలి.

చట్టసభల్లో అధికార, ప్రతిపక్షాలు స్పీకర్ కు రెండు కళ్లు లాంటివి. సభలో కుడి వైపున అధికార పక్షం, ఎడమ వైపున ప్రతిపక్ష సభ్యులు కూర్చుంటారు. చట్టసభల్లో ప్రజావాణి మూగపోకుండా ఉండాలి అంటే స్పీకర్ చూపు ఎడమ వైపే ఎక్కువగా ఉండాలి. ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత కొంతకాలంగా కనుమరుగయింది. స్పీకర్ గా ఎన్నికయిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఇదో సవాల్. పాత్రుడు అధికార తెలుగుదేశానికి ఆది నుంచి విశ్వాసపాత్రుడు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. అదే ప్రాంతానికి చెందిన తమ్మినేని సీతారాం గత వైసీపీ ప్రభుత్వంలో స్పీకరగా ఉన్నారు. జగన్ శిబిరం అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని సభలో కించపరుస్తున్పప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని హావభావాలు చూస్తే ఏవగింపు కలిగించేలా ప్రవర్తించారనే వర్తలు వచ్చాయి. అచ్చెన్నాయుడు ఆహారాన్ని గురించి సభానాయకుడు గేలి చేస్తున్నప్పుడు కూడా తమ్మినేని ఏక పక్షంగానే కనిపించారని సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది.ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అదే స్థానంలోకి వచ్చారు. అయ్యన్న కుటుంబం జగన్ ప్రభుత్వం హయాంలో వేధింపులకు గురయింది. అప్పటి ప్రభుత్వం అయ్యన్న ఇంటిని అక్రమ కట్టడం అని కూలగొట్టింది. సీఐడీనిని ఉసిగొల్పి 10 కేసులపైనే అయ్యన్న కుటుంబంపై బనాయిచింది. ఎన్టీఆర్ కాలం నుంచీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయ్యన్న పాత్రుడు టీడీపీ కి ఓల్డ్ గార్డ్. ఒకరకంగా చెప్పాలంటే అయ్యన్నపాత్రుడు బాబుకి ఫ్రంట్ లైన్ వారియర్. రెఫరీగా ఉండాల్సినస్థానంలోకి ఇప్పుడు బాబు అయ్యన్నను సభాపతిని చేశారు. అంటే బాబు విజన్ క్లియర్. పంటికి పన్ను, కంటికి కన్ను అనే బాబు ధోరణ స్పష్టం అవుతోంది.అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కోడెల శివప్రసాద్ కంటే, తమ్మినేని కంటే అయ్యన్న వేరుగా ఉండలేరని అర్థం అవుతోందంటున్నారు విశ్లేషకులు. సభాపతి అయ్యాక అయ్యన్న ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ప్రసంగంలో ప్రతిపక్షం పేరును కూడా ప్రస్తావించలేదు. తన ఉన్నతికి కారణమయిన రాజకయీ పార్టీకి అతీతంగా ఉండడం అయ్యన్నకు సాధ్యమా? దీనికి తోడు అధికారపక్షానికి మెజారీటీ ఉంది. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిలో ఉంది. గతాన్ని దిగమింగి అధికార పక్షం మాటకు భిన్నంగా సంప్రదాయం కోసం సభాపతి సమధర్మాన్ని పాటించగలరా? అక్కడ ఉండేది ఒకప్పటి లోక్ సభ స్పీకర్లు నీలం సంజీవ రెడ్డి, సోమనాథ్ చటర్జీ కాదు. కేవలం అధికారపార్టీకి విశ్వాసులు మాత్రమే. ఇప్పుడు సభలో లేని యనమల, అశోకగజపతి రాజు లాంటివారు మినహా సభలో ఎంతమంది సభా ప్రవర్తనా నియమావళిని వంటపట్టించుకున్నారు? పోయిన కాలమే మంచిదనిపిస్తోంది. అనే వాదనలు వినిపిస్తున్నాయి.ఆ నాటి ఉమ్మడి రాష్ట్రంలో సంఖ్యాబలం లేక కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా ను కోల్పోయింది. 27 మంది సభ్యులతో పీజేఆర్ ప్రతిపక్షనాయకుడు. యనమల రామకృష్ణుడు స్పీకర్ స్థానంలో ఉండి బ్యాలెన్స్ చేయగలిగారు. ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్షం సభకు వెళ్లాలి.తర్వాత కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి స్పీకర్ గా ఎంపికయిన దళిత మహిళ ప్రతిభా భారతికి అది గడ్డుకాలం. 90 మంది సభ్యులకు పైబడి ఉన్న కాంగ్రెస్ బలమయిన ప్రతిపక్షం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే ధీటయిన ప్రతిపక్షనాయకుడు. 90 మంది సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడితే కూడా సభ స్తంభించిపోయేది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతిభా భారతి ఎంతో ఓర్పు, నేర్పు ప్రదర్శించి ప్రతిపక్షం గొంతు నొక్కేశారనే అపవాదు లేకుండా నెట్టుకొచ్చారు. ఇప్పుడ జగన్ పూలు అమ్మాల్సిన చోటే కట్టెలమ్మాల్సి వస్తోంది. ప్రత్యర్థిపైన మీరు రాళ్లూ విసిరారు. అటు వైపు నుంచి మీ మీద పూలు పడవు కదా! గుండె నిబ్బరం కావాల్సింది బలం లేనప్పుడేప్రత్యర్థి పైన మీరు రాళ్ళూ విసిరారు. అటువైపునుంచి మీ మీద పూలు పడవు కదా! జగన్ కు ఇప్పుడు కావాల్సింది
గుండె నిబ్బరం, ఓర్పు, లౌక్యం. బలం లేనప్పుడే. అవమానాలను దిగమింగుకోగలిగిన మనో నిబ్బరం. అది కాస్త బాబు దగ్గర జగన్ అరువు తెచుకోవాల్సిన సమయం ఇదిమనకు వచ్చిన సీట్లను బట్టి చూస్తే మనం అసెంబ్లీకి పొయ్యి పెద్దగా చేసేదేమి లేదు” అని జగన్ అనడం యుద్దానికి ముందే తెల్ల జెండా ఊపడం లాటిదే. అది పలాయనం చిత్తగించడమే అవుతుంది. సభాపతి ఎన్నిక సందర్భం లో జగన్ సభకు హాజరు కాకపోవడం చారిత్రక తప్పిదం.
ఇది ప్రజా తీర్పు. ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్షం సభకు వెళ్లాలి.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..
    వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా , విద్యాపరంగా, వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. ఇది సహేతుకంగా…
  • సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..
    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒకప్పుడు దేశంలోనే ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. లక్ష…
  • యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..
    ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌,…
  • సింగపూర్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..
    కొవిడ్-19 మళ్లీ సింగపూర్‌ను కలవరపెడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి. గత వారంతో…
  • ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..
    ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం. నిజామాబాద్ జిల్లా పల్లెల్లో ఇప్పుడు ప్లాస్టిక్‌పై అసలైన యుద్ధం ప్రారంభమైంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు గ్రామాల్లో కనిపించకుండా చేయాలని గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

015623
Total views : 82540

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.