Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News దేవాలయాల పక్కనే వైన్స్ , సిట్టింగ్స్ పై ఎంపీ ఆందోళన..

దేవాలయాల పక్కనే వైన్స్ , సిట్టింగ్స్ పై ఎంపీ ఆందోళన..

by CVR NEWS
దేవాలయాల పక్కనే వైన్స్ , సిట్టింగ్స్ పై ఎంపీ ఆందోళన

దేవాలయాల పక్కనే వైన్స్ షాపులు, సిట్టింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని అక్కడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచి నీటి పైప్‌లైన్లలో.. మురికి నీటి పైప్‌లైన్లు కలుస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవని, వాటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలన్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణ, కొత్తగా రానున్న ఫ్లైఓవర్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణ, శానిటేషన్, నాళాల నిర్వహణ తో పాటు ఇతర అంశాలపై ప్రజాప్రతిధులు , అధికారులతో చర్చించారు. రానున్న వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, MMC కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి,లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను రాంకీ సంస్థ 2004లో దత్తత తీసుకున్నప్పటికీ సరైన అభివృద్ధి చేయలేదని మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: