కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆమె ఈ వేడుకకు హాజరుకావడం లేదంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీటికి చెక్ పెడుతూ ఈ బ్యూటీ తన కుమార్తెతో కలిసి ఫ్రాన్స్‌కు బయల్దేరారు. దీంతో కేన్స్‌లో చివరిరోజు ఐశ్వర్య సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒక ప్రముఖ బ్రాండ్ తరఫున ప్రతి ఏటా కేన్స్ రెడ్ కార్పెట్‌పై హొయలొలికించే ఐశ్వర్య ఈసారి ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్ మొదలయ్యాయి. ఆమెకు బదులుగా ఈసారి బాలీవుడ్ నటి అలియా వెళ్లారంటూ కథనాలు వచ్చాయి. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఆమె ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో వాళ్లు సంబరపడుతున్నారు. ఈసారి ఈ కేన్స్ క్వీన్ ఎలాంటి లుక్స్‌తో మెస్మరైజ్ చేయనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొదటిసారి 2002లో కేన్స్‌కు వెళ్లిన ఐష్..అప్పటినుంచి ఏటా తన ప్రత్యేకమైన దుస్తులతో మెరుస్తూనే ఉన్నారు. గతేడాది కూడా భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఆమె.. నుదుటిన సింధూరంతో అందరి దృష్టిని ఆకర్షించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కేన్స్ వేదికగా తన లుక్‌తో మద్దతు ఇచ్చి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.






Total views : 82540