మూడోసారి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రసారం..

KCR

Advertisements

&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు&period; అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్&comma; బీజేపీ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు&period; ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు&period; ఇప్పటికే పాలేరు&comma; సత్తుపల్లి&comma; ఇల్లెందు నియోజకవర్గాలల్లో కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు&period; మూడోసారి ఖమ్మం&comma; కొత్తగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు&period; మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుంటారు&period; జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో బీఆర్ఎస్ నేతలు భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు&period; ఈ సభలో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును కేసీఆర్ ఆశీర్వాదిస్తారు&period; అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల ఆవరణలో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు&period; ఉభయ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నారు&period; ఈ నేపథ్యంలో గులాబీ నేతలు సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు&period; ఖమ్మంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్&comma; ఎంపీ నామా నాగేశ్వరరావు&comma; ఎమ్మెల్సీ తాతా మధు శనివారం నాడు పరిశీలించారు&period; కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర&comma; ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..