మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టులో విచారణ..

Advertisements

<p>ఖాళీగా ఉన్న మెడికల్‌ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక&comma; మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి&period; పిటిషన్‌పై జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ&comma; జస్టిస్‌ అలోక్‌ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది&period; ఫిబ్రవరి 28à°µ తేదీతో కౌన్సెలింగ్‌ ముగిసిందని అప్పటికి ఎపీలో 246 సీట్లు&comma; తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానానికి కాలేజీ యాజమాన్యాలు వివరించాయి&period; ఏపీలో సుమారు 45 కన్వీనర్‌ కోటా సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు&period;<br &sol;>&NewLine;కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని&comma; గడువు ముగియడంతో కౌన్సెలింగ్‌ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి&period; జాతీయ మెడికల్‌ కమిషన్‌కి సంబంధిత యూనివర్సిటీలు&comma; కాలేజీలు గడువుకు విజ్ఞప్తి చేశాయని పిటిషన్‌లో పేర్కొన్నాయి&period; అయితే&comma; యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు&period; మెడికల్ కాలేజీ యాజమన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది&period; కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారానికి వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.