110
ఖమ్మం పట్టణంలోని తుమ్మల గడ్డలో ఈరోజు నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమావేశం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ … మైనార్టీల సంక్షేమం తో పాటు వారికి రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డానని అన్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారని అన్నారు . ఖమ్మం పట్టణంలో రహదారులు , మున్నేరు పై హైలెవల్ బ్రిడ్జ్ లతో ప్రగతి బాటలు వేశానని ,అరాచక, అవినీతిలేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలని సూచించారు.