Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News అకాల వర్షం… రైతన్నకు నష్టం..

అకాల వర్షం… రైతన్నకు నష్టం..

by Rama

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి సత్తుపల్లి మండలంలోని పాకలగూడెం, నారాయణపురం, కృష్టాపురం, తుమ్మూరు గ్రామాలలో వరద దాటికి పది రోజుల క్రితం వేసిన వరినాట్ల పొలాలు కొట్టుకుపోయాయి. అకాల వర్షం… రైతన్నకు నష్టం..వరద ఉధృతికి వాగుల నుంచి వచ్చిన ఇసుక మట్టి పంట పొలాల్లో మేటలు వేశాయి. ఒకప్పుడు పంటలకు సాగునీటిని వినియోగించే వాగులను పరిసర ప్రాంత రైతులు ఆక్రమించుకోవడంతో కుంచించుకుపోయిన వాగులు వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి వరదలు తలెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం దాటికి వచ్చిన వరదలు వల్ల రహదారులు పంట పొలాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తుమ్మూరు గ్రామం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాంతంలోని వరి నాట్లు వేసిన సుమారు 100 ఎకరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వేసవికాలంలో చేయాల్సిన కాలువ పనులను పూర్తి చేయకపోవడంతో.. వరద పోవాల్సిన కాలువలకు అడ్డుగా సరిపడా తూములు ఏర్పాటు చేయకపోవడంతో ఈ నష్టం ఏర్పడిందని గ్రీన్ ఫీల్డ్ కాంట్రాక్టర్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019385
Total views : 90626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.