Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana సీతారామ ఎత్తిపోతల పథకం పుంపుహౌస్ ను ప్రారంభించిన సీఎం

సీతారామ ఎత్తిపోతల పథకం పుంపుహౌస్ ను ప్రారంభించిన సీఎం

by Satya
సీతారామ ఎత్తిపోతల పథకం పుంపుహౌస్ ను ప్రారంభించిన సీఎం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌, రాజీవ్ కెనాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్‌-2ను స్విచ్చాన్‌ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. కాగా, ఈ పథకం కింద సుమారు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, ఇప్పటికే వాడుకలో ఉన్న 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద సీతారామ పంప్ హౌజ్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఇక ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌజ్‌-3ని రాష్ట్ర డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018656
Total views : 89105

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.