Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Latest News తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదు… ప్రపంచంతోనే పోటీ

తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదు… ప్రపంచంతోనే పోటీ

by Rama
తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదు… ప్రపంచంతోనే పోటీ

తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదని ప్రపంచంతోనే పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించిన కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాగ్నిజెంట్ సంస్థకు అభినందనలు తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు.సైబరాబాద్ నగరాన్ని నిర్మించారని చెప్పారు. తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదు… ప్రపంచంతోనే పోటీ. ప్రతి రంగంలోనూ హైదరాబాద్ రాణిస్తోందన్నారు. అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఉందని పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
    ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
  • నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.
    నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
  • నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
    నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
  • సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.
    సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
  • సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.
    దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: