ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్-2ను స్విచ్చాన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. కాగా, ఈ పథకం కింద సుమారు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, ఇప్పటికే వాడుకలో ఉన్న 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద సీతారామ పంప్ హౌజ్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఇక ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌజ్-3ని రాష్ట్ర డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
- బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 74515