ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండ కు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు చేపించారు. భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాల వరి విత్తనాల పూజ.కోరుకొండ నుంచి వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి భద్రాద్రి రాముల వారి ఎదుట పూజలు నిర్వహించారు. 14వ కోటి గోటి తలంబ్రాల మహా యజ్ఞంలో భాగంగా పూజలు నిర్వహించినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు. గత 14 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది ముందుగా వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో వరి విత్తనాలను చల్లి భక్తిశ్రద్ధలతో పంటను పండించి పండిన వరి ధాన్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. మహిళలంతా వరి ధాన్యాన్ని భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామ స్మరణలతో కోటి గోటి తలంబ్రాలను తయారుచేసి భద్రాచలంలోని సీతారాముల కల్యాణానికి సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరి విత్తనాలకు నిర్వహించిన పూజల్లో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 91169