రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసిన అసోసియేషన్.

Advertisements

<p>తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది&period; గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు ప్రచారం కావడంపై అసోసియేషన్ స్పందించింది&period; HPCL&comma; IOCL&comma; BPCL కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ధృవీకరించింది&period; రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని&comma; ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది&period; విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధన కొరత ఏర్పడిందని&comma; దీనిని ఇంధన కొరతగా భావించవద్దని అసోసియేషన్ తెలిపింది&period; వినియోగదారులు పుకార్లను నమ్మవద్దని&comma; ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది&period; ఇంధనం దొరకదన్న భయంతో బంకుల వద్దకు క్యూ కడుతున్నారని&comma; నిల్వలు ఉంచుకునేందుకు ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పెట్రోల్ బంకులు వాహనదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి&period; కిలోమీటర్ల మేర వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాయి&period; ఆటోలు&comma; కార్లు&comma; కంటైనర్లు కూడా పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి&period; ఎవరి నోట చూసిన ఫుల్ ట్యాంక్ మాటే వినిపిస్తుండటంతో&period;&period;బంకుల్లో నిల్వ ఉన్న పెట్రోల్&comma; డీజిల్ ఖాళీ అవుతుంది&period; మళ్లీ వాటిని నింపేందుకు సమయం పడుతుండటం వల్లే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని&comma; తీవ్రమైన కొరత ఉందన్నది అవాస్తవమని బంకుల యజమాన్యాలు కూడా చెప్తున్నాయి&period; ఇంధన కొరత లేదని ఎంతచెప్తున్నా వాహనదారులు వినడం లేదని వాపోతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..